దేవతా పరిచయం
శ్రీ నాగరాజు
నాగరాజ ఆరాధనలో కుటుంబ, ప్రాంతీయ ఆలయ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. జీవరాశుల పట్ల గౌరవంతో ఆచరించండి.
సరళమైన ఇంటి పూజా విధానం
ఇది ప్రారంభ పాఠకుల కోసం సూచించిన సరళమైన ప్రార్థన క్రమం. ఆగమ పూజ, దీక్ష లేదా ప్రత్యేక వ్రతానికి ప్రత్యామ్నాయం కాదు. మీ కుటుంబ సంప్రదాయానికి ప్రాధాన్యం ఇవ్వండి.
సామగ్రి
శుభ్రమైన పూజా స్థలం, నీరు, పుష్పం లేదా పండు, తెలిసిన ప్రార్థన పాఠం. దీపం ఉపయోగిస్తే మండే వస్తువులకు దూరంగా స్థిరమైన పీటపై ఉంచండి.
- పూజా స్థలాన్ని శుభ్రం చేసి ప్రశాంతంగా కూర్చోండి.
- శ్రీ నాగరాజును స్మరించి ప్రార్థనకు మనస్సును నిలపండి.
- నాగరాజ ప్రార్థనను ఇంటి పూజా స్థలంలో చదవండి. జీవ పాములను తాకడం, వాటికి పాలు పోయడం వంటి చర్యలు చేయవద్దు.
- భక్తితో పుష్పం, నీరు లేదా పండును సమర్పించండి.
- కృతజ్ఞతతో ముగించి అందరి మేలును కోరుకోండి. ప్రసాదం పంచుకోండి.
పాటలు, ప్రార్థనలు
నామస్మరణ / ప్రార్థన
ఓం శ్రీ నాగరాజాయ నమః
Om Sri Nagarajaya Namah
పుస్తకంలోని భక్తి గీతాలు
పిలిచిన పలికేవా
పిలిచిన పలికేవా ఓ కోడె నాగన్నా
అందరి దేవుడవే మా బాల నాగన్నా ॥2॥
1. కాకాని సాంబశివుని మెడలో ఉన్నావా
శింగరాయ పాలెంలోన నీవు కొలువై ఉన్నావా ॥పిలిచిన॥
2. పళని సుబ్రహ్మణ్యేశ్వరునిగ ఇలలో వెలిసావా
మోపిదేవి గ్రామములోన కొలువై ఉన్నావా ॥పిలిచిన॥
3. భక్తులంతా కలిసి నీకు భజనలు చేసెదమే
ఈ భజన రావయ్యా నాగ, దీవించిపోవయ్యా ॥పిలిచిన॥
రావేరా నాగన్నా, దిగి రావేరా నాగన్నా ॥2॥
ఏమని పిలవనురా, నిన్నేమని కొలవనురా ॥2॥
రావేరా నాగన్నా, దిగి రావేరా నాగన్నా ॥2॥
నాగయ్య నాగప్ప
నాగయ్య నాగప్ప నాగరాజా - మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా
1. శివయ్య మెడలోనా నాగరాజా
నీకు కమ్మని పాలు తెచ్చామయ్యా నాగరాజా ॥నాగయ్యా॥
2. నందినికి అనుజుడవె నాగరాజా
నీకు పాలు, పండ్లు తెచ్చామయ్యా నాగరాజా ॥నాగయ్యా॥
3. అందరికీ అనుజుడవె నాగరాజా
నీకు పన్నీరాభిషేకమయ్యా నాగరాజా ॥నాగయ్యా॥
4. నాగస్వరము ఊదినాను నాగరాజా
నీవు పరవశించి ఆడవయ్యా నాగరాజా ॥నాగయ్యా॥
5. శివయ్య మెడలోనా నాగరాజా
నీవు శివతాండవమాడినావ నాగరాజా ॥నాగయ్యా॥
6. పాల కడలి చిలికినావు నాగరాజా
నీవు కోపాందుడవయ్యా నాగరాజా ॥నాగయ్యా॥
7. శబరిగిరి యాత్రలోన నాగరాజా
మా తోడు నీడ నీవేనయ్యా నాగరాజా ॥నాగయ్యా॥
దిగు దిగు దిగు నాగ
దిగు దిగు దిగు నాగ నాగన్నా - దివ్య సుందర నాగ నాగన్నా (2)
1. ఇల్లలికి ముగ్గులెట్టి నాగన్నా - మల్లెలు చల్లెమో నాగన్నా
మల్లెల వాసనకి నాగన్నా - కోలాటమాడిపోరా నాగన్నా ॥దిగు॥
2. భామాలంత చేరి నాగన్నా - భావి నీళ్ళకెడితే నాగన్నా
భావిలో ఉన్నావా నాగన్నా - బాలా నాగువయ్యో నాగన్నా ॥దిగు॥
3. పిల్లాలంత చేరి నాగన్నా - పుల్లాలేరపోతే నాగన్నా
పుల్లలో ఉన్నావా నాగన్నా - పిల్లా నాగువయ్యో నాగన్నా ॥దిగు॥
4. పూలు పళ్లు తెచ్చి నాగన్నా - నీ పుట్టకొచ్చామో నాగన్నా
పుట్టలో ఉన్నావా నాగన్నా - పులీ నాగువయ్యో నాగన్నా ॥దిగు॥
5. కూలీలంత కలిసి నాగన్నా - గోంగూర కోస్తుంటే నాగన్నా
గోంగూరలో ఉన్నావా నాగన్నా - గోధుమ నాగువయ్యో నాగన్నా ॥దిగు॥
మారాజు కౌశికుడు (నాగరాజు)
మారాజు కౌశికుడు మేడె కట్టంగా
మేడ మీదాడింది నాగో - మేడంచుమీద ఆడింది నాగు
1. మా తల్లి దుర్గమ్మ కురులె దువ్వంగ
కురుల మీద ఆడింది నాగో - కురులంచుమీద ఆడింది నాగు
2. మా తండ్రి రామయ్య పంచె కట్టంగా
పంచె మీదాడింది నాగో - పంచె అంచుమీద ఆడింది నాగు
3. మా తల్లి సీతమ్మ చీరే కట్టంగా
చీర మీదాడింది నాగో - చీరంచుమీదాడింది నాగు
4. మా చిన్ని కృష్ణయ్య మురళీ ఊదంగ
మురళి మీదాడింది నాగో - మురళంచుమీదాడింది నాగు
5. మా తండ్రి ఈశ్వరుడు శంఖం ఊదంగ
శంఖం మీదాడింది నాగో - శంఖం అంచుమీదాడింది నాగు
6. మా దైవం అయ్యప్ప ధనస్సే పట్టంగా
ధనస్సు మీదాడింది నాగో - ధనస్సు అంచుమీదాడింది నాగు
7. మా బొజ్జ గణపయ్య ఎలుకే ఎక్కంగా
ఎలుక మీదాడింది నాగో - ఎలుక శిరస్సు మీదాడింది నాగు
8. మా అన్న హనుమన్న గధనే పట్టంగా
గధ మీదాడింది నాగో - గధ అంచుమీదాడింది నాగో
9. కైకలూరు భక్తులంత భజనే చేయంగా
భజనలో ఆడింది నాగో - భజన పడిమీద ఆడింది నాగో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి