విషయానికి వెళ్లండి
తెలుగులో భక్తి, ధర్మం, మన సంప్రదాయాలు
ధర్మో రక్షతిDHARMO RAKSHATIభక్తి, ధర్మం, ఆధ్యాత్మిక జ్ఞానం

Digu Digu Digu Naga Lyrics

పాటల జాబితా

దిగు దిగు దిగు నాగ

NAGA-02 | పుస్తక పుట 316

కింద తెలుగు లేదా English లిపిని ఎంచుకోండి. English పాఠం స్వయంచాలక లిప్యంతరీకరణ; అనువాదం కాదు.

ప్రధాన గాయకుడుసమూహ గానం

దిగు దిగు దిగు నాగ నాగన్న - దివ్య సుందరి నాగో నాగన్న

దిగు దిగు దిగు నాగ నాగన్న - దివ్య సుందరి నాగో నాగన్న || దిగు దిగు ||

అటు కొండ ఇటు కొండ నాగన్న - నడుమ నాగుల కొండో నాగన్న

కొండలో ఉన్నావ నాగన్న - కోడె నాగు వయ్యో నాగన్న || దిగు దిగు ||

ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న - ఇంటా మల్లెలు జల్లి నాగన్న

మల్లెల వాసనకు నాగన్న - కోలాట మాడి పోరా నాగన్న || దిగు దిగు ||

భామాలంతా కలసి నాగన్న - బావి నీళ్లకెలితే నాగన్న

బావిలో ఉన్నవా నాగన్న బాలా నాగువయ్యో నాగన్న || దిగు దిగు ||

పిల్లలంతా కలసి నాగన్న - పుల్లాలేరబోతే నాగన్న

పుల్లలో ఉన్నవా నాగన్న - పిల్లా నాగువయ్యో నాగన్న || దిగు దిగు ||

పూలు పండ్లు తెచ్చి నాగన్న - పుట్ట ముందుఉంచా నాగన్న

పుట్టలో ఉన్నావ నాగన్న కోడే నాగువయ్యో నాగన్న || దిగు దిగు ||

పిల్లల కోసమని నాగన్న - నీ పూజ చేశాము నాగన్న

పిల్లలు పుడితేను నాగన్న - నీ పేరు పెడతాను నాగన్న || దిగు దిగు ||

స్వాములంతా కలసి నాగన్న - పువ్వులేరబోతే నాగన్న

పూలల్లో ఉన్నావా నాగన్న - నల్లా నాగువయ్యో నాగన్న || దిగు దిగు ||

భక్తులంతా చేరి నాగన్న - భజనలు చేస్తుంటే నాగన్న

పూజకు రావయ్యో నాగన్న - దీవించి పోవయ్యో నాగన్న || దిగు దిగు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ధర్మో రక్షతికి స్వాగతం | Welcome to Dharmo Rakshati

  ధర్మో రక్షతి రక్షితః | Dharmo Rakshati Rakshitah ధర్మాన్ని రక్షించేవారిని ధర్మమే రక్షిస్తుంది. Dharma Protects Those Who Protect Dharma. ...